English | Telugu
అఖిల్‌కి అంత స్టామినా ఉందా?
Updated : Sep 19, 2015
అఖిల్ తొలి సినిమాపై టాలీవుడ్ ఫోకస్ పెట్టింది. ఈ సినిమాతో ఈ డెబ్యూ హీరో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అంటూ ఎదురుచూపులు చూస్తోంది. దసరా సీజన్‌లో విడుదల అవ్వడం ఈ సినిమాకి అది పెద్ద ప్లస్ పాయింట్. వినాయక్ దర్శకుడవ్వడం, ఇప్పటికే ఈ సినిమాకి కావల్సినంత బజ్ రావడంతో... అఖిల్ సరికొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు ఊహిస్తున్నాయి. అఖిల్ తొలి సినిమాతోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరతాడని లెక్కగడుతున్నాయి.
ఇప్పుడున్న క్రేజ్, పెరిగిన మార్కెట్ దృష్ట్యా రూ.50 కోట్లు సాధించడం అఖిల్‌కి అసాధ్యమేం కాదు. అయితే.. ఈ సినిమాకి రూ.50 కోట్లు వస్తే సరిపోవు. అంతకు మించి సాధిస్తేనే అఖిల్ సినిమా వర్కవుట్ అయినట్టు. ఎందుకంటే ఈసినిమాపై ఇప్పటి వరకూ రూ.40 కోట్ల వరకూ ఖర్చు పెట్టారట. ఓ డెబ్యూ హీరోకి ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యింది. రూ.40 కోట్లు తిరిగి దక్కించుకోవాంటే కనీసం రూ.60 కోట్ల గ్రాస్ అందుకోవాలి. వడ్డీలు కూడా కలుపుకొంటే.. అఖిల్ సినిమా బాక్సాఫీసు దగ్గర కనీసం రూ.75 కోట్ల వరకూ సాధించాలి. లేదంటే అఖిల్ సినిమా నష్టాలు మూటగడ్డుకొనే ప్రమాదం ఉంది. నిజానికి అఖిల్ రూ.50 కోట్లు సాధించినా అక్కినేని అభిమానులకు పండగే.
ఎందుకంటే అక్కినేని నాగార్జున, నాగచైతన్య వీరిద్దరిలో ఎవరి సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరలేకపోయింది. ఆ అవకాశం తొలి సినిమాతోనే అఖిల్ దక్కించుకొంటే.. ఫ్యాన్స్‌కి పండగే కదా. కానీ నిర్మాతగా నితిన్ గట్టెక్కాలంటే ఈ సినిమా కనీసం రూ.70 కోట్లు వసూలు చేయాలి. మరి అఖిల్‌కి అంత స్టామినా ఉందంటారా??