English | Telugu
అత్తారింటికి మరో పురస్కారం
Updated : Apr 4, 2014
2013వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి ఈ చిత్రానికి తాజాగా మరో పురస్కారం వచ్చింది. ప్రతీ సంవత్సరం ఉత్తమ చిత్రాలకు అందజేసే బి.నాగిరెడ్డి పురస్కారాన్ని 2013కి గాను "అత్తారింటికి దారేది" చిత్రానికి అందించనున్నారు. ఈ విషయాన్ని విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బాధ్యులు బి.వెంకట్రామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ కి అందజేయాలని నిర్ణయించారు. ఈ పురస్కార కార్యక్రమం ఈనెల 20న హైదరాబాదులో జరగనుంది.