English | Telugu

బండ్ల‌వారికి మ‌రో బ‌క‌రా దొరికాడు!

సొమ్మొక‌డిది - సోకొక‌డిది అంటే ఇదేనేమో..?? డబ్బులొక‌రివి, నిర్మాత అనే హోదా మ‌రొక‌ర‌ది. చిత్ర‌సీమ‌లో ఇవ‌న్నీ మామూలే. అయితే.. అలా న‌మ్మే వ్య‌క్తుల్ని వెదికి ప‌ట్టుకొని, వాళ్ల‌కు బినామీలుగా ఉండ‌డం ఓ ఆర్టు. అందులో డిగ్రీ పుచ్చుకొన్నాడు బండ్ల గ‌ణేష్‌. ఓ సామాన్య‌మైన న‌టుడు అగ్ర‌హీరోల‌తో సినిమాలు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తే విష‌య‌మే. కోళ్ల ఫారాల వ్యాపారం బాగా క‌లిసొచ్చింది.. అందుకే నిర్మాత‌య్యా అంటున్నాడు గానీ, గ‌ణేష్‌ వెనుక కొంద‌రు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉన్నార‌ని అప్ప‌ట్లో చెప్పుకొన్నారు. వాళ్లే పెట్టుబ‌డి పెడుతున్నార‌ని, మ‌నోడు పైపైకి షో చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం ఉందోగానీ.. ఇప్పుడు మ‌రో బ‌డాబాబుని ప‌ట్టేశాడు గ‌ణేష్‌. డ‌బ్బుల‌న్నీ ఆయ‌న‌వి... పేరు మాత్రం ఈయ‌న‌ద‌ట‌. ఇంత‌కీ ఆ బ‌డాబాబు ఎవ‌రో తెలుసా..?? స‌చిన్ జోషీ.


టెంప‌ర్ సినిమా ప‌రిస్థితి విడుద‌ల‌కు ముందు అస్థ‌వ్య‌స్తంగా ఉండేది. డ‌బ్బుల్లేక ఆగిపోయిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అప్పుడే గ‌ణేష్ దృష్టి స‌చిన్‌పై ప‌డింది. అప్ప‌టికే వీరిద్ద‌రూ ఓ సినిమా చేశారు. అదీ ఫ్లాప్ అయినా గ‌ణేష్ పై స‌చిన్‌కి న‌మ్మ‌కం పోలేదు. దాంతో మ‌ళ్లీ మ‌ళ్లీ పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందుకొచ్చాడ‌ట‌. టెంప‌ర్ లోనూ స‌చిన్ పెట్టుబ‌డులు భారీగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. పీవీపీ సంస్థ కూడా ఓ చేయి వేసి ఆదుకోవ‌డంతో టెంప‌ర్ గ‌ట్టెక్కేసింది. ఇప్పుడు స‌చిన్ జోషిని పార్ట‌న‌ర్‌గా చేసుకొని ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్‌పై సినిమాలు చేయ‌డానికి గ‌ణేష్ రెడీ అయిపోయాడ‌ని టాక్‌. స‌చిన్‌కి సినిమాల పిచ్చి. బ్యాంకు బ్యాలెన్స్ బోలెడంత ఉంది. ఈ వీక్‌నెస్ క్యాష్ చేసుకోవ‌డం ఎంత‌సేపూ..??? అందుకే స‌చిన్ ని అడ్డు పెట్టుకొని సినిమాలు తీసేసే భారీ స్కెచ్ వేశాడు గ‌ణేష్‌. మొత్తానికి గ‌ణేష్‌కి మ‌రో ఆస‌రా దొరికింది. ఇక రెచ్చిపోవ‌డం ఎంత సేపూ..??

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .