English | Telugu

ల‌వ‌కుశ కాదు... ల‌వ 'కిస్సా..?'

టాలీవుడ్ ఇమ్రాన్ హ‌ష్మీలా త‌యార‌య్యాడు మ‌న వ‌రుణ్‌సందేశ్. ఒకే సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను లిప్ లాక్ చేసేసి..ఓ హాట్ రికార్డు సొంతం చేసుకొన్నాడు. వ‌రుణ్ సందేశ్ కొత్త చిత్రం ల‌వ‌కుశ‌. ఇందులో ముద్దులే ముద్దులో. ఈ సినిమాలో ల‌వ కుశ‌లుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు వ‌రుణ్‌సందేశ్‌. దానికి తోడు ఇద్ద‌రు హీరోయిన్లు. వాళ్లిద్ద‌రికీ ఎడా పెడా ఎంగిలి ముద్దులిచ్చేశాడు. ల‌వ కుశ ట్రైట‌ర్ చూస్తే.. అందులో అన్నీ ముద్దులే. వ‌రుణ్‌కి ఇలా హీరోయిన్ల‌తోలిప్ లాక్‌లు చేయ‌డం కొత్త‌కాదు. ఇది వ‌ర‌క‌టి నుంచీ ఉంది. కొత్త‌బంగారులోకం, ఏమైంది ఈ వేళ‌, ప్రియ‌త‌మా నీవ‌చట కుశ‌లమా, ప‌డ్డానండీ ప్రేమ‌లో మ‌రి సినిమాల్లో ఇలాంటి పెద‌వెంగిలి సన్నివేశాలున్నాయి. మ‌రోసారి వాటినే న‌మ్ముకొన్నాడీ యువ క‌థానాయ‌కుడు. టోట‌ల్‌గా ఈ సినిమా పేరు ల‌వ‌కుశ‌గా పెట్టారు గానీ.. ల‌వ్ కిస్‌గా మార్చేశాడు వ‌రుణ్ సందేశ్. ట్రైట‌ర్‌లోనే నాలుగైదు ముద్దులు, ఓ న‌డుం స‌న్నివేశం చూపించారు. ఇక సినిమా ఇంకెంత హాట్‌గా ఉంటుందో. ల‌వ‌కుశ అంటే ఏదో భ‌క్తిర‌స ప్ర‌ధాన‌మైన చిత్రం అనుకొని థియేట‌ర్‌కి వెళ్తే ఇక అంతే సంగ‌తులు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.