English | Telugu

గీతాఆర్ట్స్ లో బన్నీ బోయపాటి చిత్రం

బాక్సాఫీస్ క‌లెక్షన్లని రేసుగుర్రం లా ప‌రిగెత్తించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , వ‌రుస సూప‌ర్ స‌క్సస్‌ల‌తో ప‌వ‌ర్‌ఫుల్ దర్శకుడిగా త‌న‌కంటూ బాక్సాఫీస్ లో ప్రత్యేక‌ స్థానం సంపాయించిన ప‌వ‌ర్ ఫుల్ ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వంలో చిత్రం సెట్స్ మీద‌కి వెల్లనుంది. ఈచిత్రాన్ని ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అరవింద్ వ‌రుస విజ‌యాల‌తో ఇటు సౌత్ ఇండియాలోనే కాక నార్ట్ ఇండియాలో కూడా బ్లాక్‌బ‌స్టర్స్ అందించిన‌ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లొ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మ్యూజిక్ తో స‌క్సస్ ల మీద స‌క్సస్ లు కొడుతున్న థ‌మ‌న్. ఎస్.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ చిత్రం మార్చిలో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఏస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ .. అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో చిత్రం చేయాల‌ని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. బోయ‌పాటి శ్రీను చెప్పిన క‌థ నాకు, బ‌న్ని కి బాగా న‌చ్చి మా బ్యాన‌ర్ గీతాఆర్ట్స్ లో చేస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వుంటూ ప్యూర్ ల‌వ్ స్టోరి మిక్స్ అయిన క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. బ‌న్ని ని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో ప‌క్కాగా అలాంటి కేర‌క్ట‌రైజేష‌న్ తో బోయ‌పాటి శ్రీను క‌థ చెప్పటంతో అంద‌రికి న‌చ్చింది. రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని ఎన‌ర్జిని దృష్ఠిలో పెట్టుకుని త‌న స్టైల్ ని కొత్త‌గా క్రియోట్ చేశారు బోయ‌పాటి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఆ వివ‌రాలు త్వర‌లో చెబుతాం. రేసుగుర్రం చిత్రం త‌రువాత బ‌న్ని కాంబినేష‌న్ లో థ‌మ‌న్ చేస్తున్న రెండ‌వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మార్చిలో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభించి ఏప్రిల్ నుండి రెగ్యుల‌ర్ షూటి్ంగ్ చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రించే విధంగా వుంటుంది.. హీరోయిన్స్ తో పాటు మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు త్వ‌]ర‌లో తెలియ‌జేస్తాం..అని అన్నారు అని అన్నారు.

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. బ‌న్ని తో సినిమా ఎప్పుడో చేయాల్సింది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయో క‌రెక్ట్ క‌థ సిధ్ధంచేశాను. అర‌వింద్ గారు, బ‌న్ని ఈ క‌థ విని వెంట‌నే ఓకే చేశారు. ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి, హీరోయిజం వుంటూనే ల‌వ్ స్టోరి వుంటుంది. ఈచిత్రం లో కొత్త బ‌న్ని క‌న‌ప‌డ‌తాడనేది ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. బ‌న్నితో చేయ‌టం అది కూడా అల్లు అర‌వింద్ గారు నిర్మాత గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో చిత్రం తెర‌కెక్క‌టం చాలా సంతోషంగా వుంది. ఈచిత్రం మార్చిలో పూజా కార్యక్రమాలు జ‌రుపుకొని, ఏప్రిల్ నుండి సెట్స్ మీద‌కి వెల్లనున్నాము. ఈచిత్రం త‌రువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మ‌రో చిత్రం చేయ‌నున్నాము. అది ఈ ఈ చిత్రం షూటి్ంగ్ పూర్తయిన వెంట‌నే వుంటుంది అని అన్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.