English | Telugu
బాలయ్య వందో సినిమాకు ఈయనే నిర్మాత
Updated : Mar 7, 2016
బాలయ్య వందో సినిమా ఎలా ఉండబోతోందా అని నందమూరి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందో సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే దానిపై అనేక కథనాలు వస్తున్నా, తాజాగా ఈ సినిమాకు నిర్మాతలు ఎవరో ఫిక్సైపోయింది. ఇప్పటికే బాలయ్యతో లెజండ్ లాంటి సినిమాను సంయుక్తంగా తీశారు వారాహి చలనచిత్రం, 14 రీల్స్ సంస్థలు. తాజాగా, సాయి కొర్రపాటి నిర్మాణంలో, మళ్లీ ఈ రెండు సంస్థలు కలిసి బాలయ్య వందో సినిమాను తెరకెక్కించబోతున్నాయి.
ఈ విషయమై సాయి కొర్రపాటి ఇప్పటికే తేల్చేశారు. కానీ డైరెక్టర్ ఎవరు అన్నదానిపైనే ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారమైతే, కృష్ణవంశీయే బాలయ్యతో డైరెక్షన్ ఛాన్స్ కొట్టబోతున్నాడు. మరో పక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా హింట్ ఇచ్చారు సాయి. మోక్షును కూడా తనే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఆయక క్లియర్ గా చెప్పేయడం విశేషం.