English | Telugu
కళాభవన్ మణి ఇక లేరు..
Updated : Mar 6, 2016
విలక్షణ నటుడు కళాభవన్ మణి కన్నుమూవారు. గత కొంతకాలంగా ఆయన లివర్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మణి, సల్లాపం అనే సినిమాలోని తన పాత్రకు మంచి పేరు రావడంతో, ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. తెలుగులో జెమినీ సినిమాలో లడ్డా పాత్రతో తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే పాత్ర చేశారు కళాభవన్ మణి. కేవలం ఒక కమెడియన్ గా, రంగస్థల నటుడిగానే కాక, జానపద పాటలు పాడటంలో కూడా మణికి మంచి పేరుంది.
చివరిగా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను రోబో సినిమాలో చిన్న పాత్రలో చూశారు. విలనిజానికి కామెడీని మిక్స్ చేసి, నటించడంలో కళాభవన్ మణిది చాలా విలక్షణమైన శైలి. కాగా నటుడు కాకముందు, మణి ఆటోడ్రైవర్ గా చేసేవారు. ఆ స్థాయి నుంచి తనను దక్షిణ భారతదేశమంతా గుర్తించగలిగే స్థాయికి ఎదిగారు. గత కొన్నేళ్లుగా ఆయన్ను లివర్, కిడ్నీ సమస్యలు వేధిస్తుండటంతో కొచ్చిలోని హాస్పటల్లో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి 7.15 నిముషాల సమయంలో తుదిశ్వాస విడిచారు మణి. ఆయన మరణంపై తమిళ తెలుగు చిత్రసీమలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి.