English | Telugu

సంక్రా౦తి బరి నుంచి బాలయ్య అవుట్ ..!

బాల‌కృష్ణ, త్రిష జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. స‌త్యదేవ్ ద‌ర్శకుడు. ఈ చిత్రాన్ని సంక్రా౦తి బరిలో దించడానికి సన్నాహాలు జరిపారు. ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు. షూటింగ్ లో జాప్యం జరగడమే ఇందుకు గల కారణం అని సమాచారం. బాలయ్య గాయపడటం, ఆ తరువాత బాలయ్య హుదూద్ పర్యటన, మధ్యలో వర్కర్స్ యూనియన్ సమ్మె.. వంటి అవాంతరాలు కారణంగా షూటింగ్ డీలే అయ్యింది. దీంతో మొదట అనుకున్న టైం కి షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బాలయ్య అనుకున్న టైమ్ కి వచ్చే అవకాశం లేదని యూనిట్ వర్గాల సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో చిత్ర యూనిట్ వుంది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.