English | Telugu

తమిళ్ సినిమాలో నాగచైతన్య..!!

తమిళంలో హిట్టైన 'వేట్టియ్' సినిమాని 'తడాఖా' గా రీమేక్ చేసి మంచి ఫలితం సాదించాడు నాగచైతన్య. ఇప్పుడు మరో రీమేక్ కు రెడీ అవుతున్నాడు. ఇటివల కోలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'సిగరం తోడు' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏటీయం దొంగతనం నేపధ్యంలో సాగిన ఈ సినిమా స్క్రీన్ ప్లే, యాక్షన్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా చైతు హీరోగా తెలుగులో రీమెక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇటివలే ఈ చిత్రం రీమేక్ హక్కులను నాగర్జున ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారని తెలిసింది. అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని నాగ్ డిసైడ్ అయ్యారట. తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌరవ్ దీనికి కూడా దర్శకత్వం వహించే అవకాశాలు వున్నయని సమాచారం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.