English | Telugu
బాలయ్య సిఎం కేసీఆర్ కు ఇచ్చిన ఇన్విటేషన్ ఇదే..!
Updated : Apr 21, 2016
తన వందో సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాలకృష్ణ, తనకు ఎంతో ప్రత్యేకమైన మూవీ ఓపెనింగ్ రోజున టీ సిఎం కేసీఆర్, ఏపీ సిఎం చంద్రబాబును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న ఉదయం 10.27 నిముషాలకు, మూవీ ఓపెనింగ్ షాట్ చిత్రీకరిస్తున్నారు. కేసీఆర్ కు బాలకృష్ణ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత, ఆ ఆహ్వాన పత్రిక ఎలా ఉందోనన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. సినిమా వైవిధ్యాన్ని ఈ పత్రిక ద్వారానే చూపించారు క్రిష్ అండ్ కో. డైరెక్ట్ గా శాతకర్ణి మహారాజే అందర్నీ ఆహ్వానిస్తున్నట్టుగా, తన పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నట్టుగా చెబుతూ లేఖను తయారుచేశారు. కేసీఆర్ ను మిత్రమా అని సంబోధిస్తూ మొదలయ్యే లేఖ, ఇట్లు శ్రీశ్రీశ్రీ గౌతమీ పుత్ర శాతకర్ణి అంటూ ఎండ్ అవడం విశేషం. అంతేకాకుండా సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ల అందరి పేరు మందూ, వారి వారి తల్లిదండ్రుల పేర్లు చేర్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఇచ్చిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లేఖలో అడుగుభాగాన శాతకర్ణి రాజముద్రను ప్రింట్ చేయడం కొసమెరుపు.