English | Telugu

బాల‌య్య సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారా?? ఇక పూర్తిగా రాజ‌కీయాల‌కే త‌న జీవితాన్ని అంకితం చేయ‌బోతున్నారా?? ప‌రిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. బాల‌య్య వందో సినిమాకి ద‌గ్గ‌ర ప‌డుతున్నారు. సెంచ‌రీ మైలురాయిని అందుకోగానే బాల‌య్య సినిమాల‌కు దూర‌మ‌వుతార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 99వ చిత్రంగా డిక్టేట‌ర్‌ని చేస్తున్నారు. ఆ త‌ర‌వాత బోయ‌పాటితో వందో సినిమా ఉంటుంది. సెంచ‌రీ కొట్టాక‌... ఆయ‌న రాజకీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. బాల‌య్య మూడ్ పూర్తిగా పోలిటిక్స్‌పై ఉంద‌ని, ఆయ‌న సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న కాంపౌండ్ వ‌ర్గాలే చెబుతున్నాయి. బాల‌య్య 99వ సినిమా డిక్టేట‌ర్ లాంఛ‌నంగా ప్రారంభ‌మై నెల‌రోజులైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగ్ మొద‌లవ్వ‌లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడి వేడిగా న‌డుస్తున్న ఈ నేప‌థ్యంలో తాను సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేన‌ని బాల‌య్య చెబుతున్నార‌ట‌. అభిమానుల కోరికపై వంద సినిమాలుచేసి.. ఆ త‌దుప‌రి బాధ్య‌త వార‌సుడు మోక్ష‌జ్ఞ‌కి అందివ్వాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యార‌ట‌. చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్త‌య్యే స‌రికి క‌నీసం రెండేళ్ల‌యినా అవుతుంది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఎన్నిక‌లొస్తాయి. ఈసారి బాల‌య్య‌కు మంత్రివ‌ర్గంలో స్థానం దాదాపుగా ఖాయ‌మైన నేప‌థ్యంలో బాల‌య్య‌... ఇక‌పై పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడిగా చ‌లామ‌ణి అవ్వ‌డానికే మొగ్గు చూపుతార‌ని టాక్‌. అదే నిజ‌మైతే బాల‌య్య ఫ్యాన్స్ డీలా ప‌డ‌క త‌ప్ప‌దు.

త‌మ అభిమాన హీరోని మోక్ష‌జ్ఞ రూపంలో చూసుకొని త‌రించ‌డం మినహా మ‌రో మార్గం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.