English | Telugu
అల్లు అర్జున్ లింగుస్వామి కాంబోలో సినిమా..!
Updated : Apr 24, 2016
అల్లు అర్జున్ కెరీర్ ను పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకూ యూత్ హీరోగా ఉన్న బన్నీ, తనను తాను మాస్ హీరో లా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట బోయపాటితో ఊరమాస్ సరైనోడును ఎంచుకున్న బన్నీ, ఇప్పుడు తమిళ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా కమిట్ అయ్యాడని సమాచారం. తాజాగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో బన్నీని లింగు స్వామిని కలిశాడట. ఇద్దరూ తమ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలపై కూర్చున్నారని ఇన్ సైడ్ టాక్. మాస్ సినిమాలను, హీరోయిజాన్ని పెర్ఫెక్ట్ గా చూపించడంలో లింగుస్వామికి తిరుగు లేదు. బన్నీ లింగుస్వామి కలిసి తీస్తే మాత్రం, సినిమాపై గ్యారంటీగా భారీ అంచనాలు ఏర్పడతాయనడంలో డౌట్ లేదు. కాగా, సరైనోడి రెండో రోజు కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. వీకెండ్ కావడంతో, ఆదివారం వరకూ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా, సోమవారం నుంచి సినిమా ఎలా ఉండబోతుందన్న మీదే ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ల చూపులున్నాయి.