English | Telugu
అరుకులో బాలయ్య 98వ చిత్రం
Updated : Jun 17, 2014
బాలయ్య 98వ చిత్రం జూన్ 2 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా త్రిష కనిపించబోతోంది. సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ అరుకులో మొదలుకానుంది. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ ఏర్పాట్లలో యూనిట్ మునిగివుంది. బిజినెస్ మ్యాన్ రుద్రపతి రమణరావు నిర్మాణ సారథ్యంలో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో త్రిషతోపాటు మరో హీరోయిన్ గా అంజలి కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు త్రిష డిమాండ్ చేసిన భారీ మొత్తం గురించి చాలా వార్తాకథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.