English | Telugu

హన్సిక విలనిజం


రబ్బరు బొమ్మలా వుండే హన్సిక ప్రేమదేవతలా కనిపిస్తుందంటే మామూలే. అందుకే ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ దారి ఎంచుకుంది. హీరోయిన్ నుంచి విలన్‌గా మారిపోతానంటోంది. అదీ మహా సంబరంగా ఈ పాత్ర చేస్తానంటోంది. చిలిపిగా, ముద్దుగా నవ్వుతూ వుండే హన్సిక విలన్ అవతారం కోసం చాలా ఎక్స్‌సైటెడ్‌గా వుంది. రోమియో జూలియట్ పేరుతో తమిళంలో రూపొందుతున్న చిత్రంలో హన్సిక విలన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో జయం రవి కూడా నటిస్తున్నాడు.


ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్‌లో హన్సిక నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుందని, మిగతా సగంలో రవి విలన్ గా కనిపిస్తాడని చిత్ర దర్శకుడు లక్ష్మణ్ చెబుతున్నారు. ఇదే ఈ చిత్రంలోని కొత్తదనం అని ఆయన చెప్పారు. హన్సిక ఉత్సాహం, దర్శకుడి నమ్మకం చూస్తుంటే సినిమా నిజంగానే డిఫరెంట్ అనిపిస్తోంది. ఇక క్యూట్ హన్సిక క్రూయల్ గా ఎలా వుంటుందో స్క్రీన్ మీదే చూడాలి.