English | Telugu

2021లో ఓవ‌ర్సీస్‌ బిగ్గెస్ట్ గ్రాస‌ర్ 'అఖండ‌'.. 'వ‌కీల్ సాబ్‌'ను దాటేశాడు!

'అఖండ‌'గా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కెరీర్ బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేసిన 'అఖండ' మూవీ 2021లో ఓవ‌ర్సీస్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' వ‌సూళ్ల‌ను దాటేసింది. ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సినిమాల‌కు ఇంత‌దాకా క్రేజ్ ఉండేది కాదు. 'అఖండ' సినిమాతో ఆ లోటును తీర్చేసుకున్నారు బాల‌య్య‌.

'వ‌కీల్ సాబ్' మూవీ ఓవ‌ర్సీస్‌లో ర‌మార‌మి రూ. 10 కోట్ల గ్రాస్ వ‌సూలు సాధించ‌గా, 'అఖండ' తొలివారానికే రూ. 10.08 కోట్ల గ్రాస్‌ను వ‌సూలుచేసి, ఈ ఏడాది ఓవ‌ర్సీస్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఇందులో ఒక్క యు.ఎస్‌.ఎ. వాటానే రూ. 6.68 కోట్లు. ఆస్ట్రేలియాలోనూ రూ. 1.26 కోట్ల గ్రాస్ రావ‌డం విశేషంగా చెప్పుకోవాలి.

Also read:బాల‌య్య‌తో మ‌రోసారి ప్ర‌గ్యా రొమాన్స్!

ఈ వారం విడుద‌లైన 'ల‌క్ష్య‌', 'గ‌మ‌నం' సినిమాలకు నెగ‌టివ్ టాక్ రావ‌డంతో ఈ వారం కూడా ఇంటా, బ‌య‌టా 'అఖండ' వ‌సూళ్లు స్థిరంగా ఉంటాయ‌ని ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే వీకెండ్ షోస్ టికెట్లు చెప్పుకోద‌గ్గ స్థాయిలో అమ్ముడ‌య్యాయి.

Also read:రూ. 50 కోట్ల క్ల‌బ్‌లో 'అఖండ‌'! బాల‌య్య కెరీర్ బెస్ట్‌!!

బోయ‌పాటితో బాల‌య్య కాంబినేష‌న్ ప్ర‌తిసారీ వండ‌ర్ సృష్టిస్తుంద‌ని మ‌రోసారి 'అఖండ' విజ‌యంతో రుజువ‌య్యింది. 'పుష్ప' వ‌చ్చేలోగా ఈ సినిమా మ‌రిన్ని వ‌సూళ్లు సాధిస్తుంద‌నేది నిజం.