English | Telugu

'బాహుబలి' వర్సెస్ 'బజరంగి భాయ్‌జాన్‌'

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్లు రాబడుతున్న 'బాహుబలి'కి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. మొదటి వారంలో ఎలాంటి పోటీలేకుండా కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి, రెండో వారంలోకి వచ్చే సరికి అసలైన పోటీ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ నటించిన 'బజరంగి భాయ్‌జాన్‌' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా 5000 థియేటర్లలో భారీగా రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..'బజరంగి భాయ్‌జాన్‌' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ల తో బహుబలికి గట్టి పోటీని ఇస్తోంది. సల్మాన్ ఖాన్ కి ఓవర్సీస్, ఇండియ డొమెస్టిక్ మార్కెట్ లలో కూడా మంచి క్రేజ్ వుండడంతో బాహుబలి కలెక్షన్లు చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

మరి సల్మాన్ ఖాన్ క్రేజ్ ని కూడా తట్టుకొని 'బాహుబలి' బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తుందా? లేక 'బజరంగి భాయ్‌జాన్‌' 'బాహుబలి' కలెక్షన్లకు గండి కొడతారా అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.