English | Telugu

‘బాహుబలి’కి విక్టరీ ప్రశంసలు

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’ చిత్రాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని హీరో విక్టరీ వెంకటేష్ వీక్షించారు. రాజమౌళి అండ్ టీమ్ కి అభినందనలు.

ప్రభాస్, రానా సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్, విఎఫెక్స్ సహా వందల టెక్నిషియన్స్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. వారందరూ ఇటువంటి సెల్యూలాయిడ్ ను క్రియేట్ చేసిందకు వారికి స్పెషల్ థాంక్స్.

ఇటువంటి చిత్రాన్నిరెండు సంవత్సరాల్లో విజువల్ ఎఫెక్స్ తో ఒక అద్భుత చిత్రంగా మలిచి ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాకి గొప్ప పేరు తీసుకొచ్చారు. అంతర్జాతీయస్థాయి ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారు.

రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కంగ్రాట్స్. ఈ కథపై నమ్మి హ్యుజ్ బడ్జెట్ తో నిర్మించారు. వారి ఎఫర్ట్, నమ్మకం తెలుగు సినిమా పొటెన్షియల్ ను చాటి చెప్పింది. రాజమౌళి, బాహుబలి చిత్రంతో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ప్రతి తెలుగువాడు గర్వపడే సమయమిది అని వెంకటేష్ తెలియజేశారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.