English | Telugu
'బాహుబలి' అట్టర్ ఫ్లాప్..!!
Updated : Oct 30, 2015
వెండితెపై అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన బాహుబలి..బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికలపడింది. బహుబలిని థియేటర్లలో చూసేందుకు ఎగబడి టికెట్లు కొన్న జనాలు టీవిలో చూడడానికి మాత్రం.. ఏమాత్రం ఆసక్తి చూపలేకపోయారు. దీనికి ప్రధాన కారణం.. బాహుబలి సినిమా ప్రతి 10 నిమిషాల షోకి మరో 15 నిమిషాల ఇంటర్వ్యూ ఎపిసోడ్ లు - ఎడ్వర్ టైజ్ మెంట్లు లైవ్ చేయడమే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి బాహుబలి బుల్లితెరపై మగధీర కంటే తక్కువ స్థాయిలోనే నిలిచింది. మగధీర టీఆర్ పీ 22.7 కాగా బాహుబలికి టీఆర్ పి 21.8 పాయింట్లు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది టాప్-5 మూవీస్ విషయానికొస్తే.. బాహుబలిదే టాప్ ప్లేస్!