English | Telugu
కళ్యాణ్ 'షేర్' మూవీ ట్వీట్ రివ్యూ
Updated : Oct 30, 2015
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'షేర్' మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజైంది. తనకు అభిమన్యు, కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు అందించిన మల్లికార్జున్ తో కళ్యాణ్ చేసిన మూడో సినిమా ఇది. అలాగే కళ్యాణ్ పటాస్ వంటి సూపర్ హిట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే వున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే ఫుల్ టాక్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే. 'షేర్' సినిమా లైవ్ అప్ డేట్స్ మీ కోసం తీసుకువచ్చింది తెలుగువన్.
కళ్యాణ్ రామ్ 'షేర్' సినిమా స్టార్ట్ అయ్యింది. థియేటర్ ఇప్పుడిప్పుడే హౌస్ ఫుల్ కాబోతుంది.
'షేర్' సినిమా టైటిల్స్ పడుతున్నాయి. ఫ్యాన్స్ కొంతమంది విజిల్స్ వేస్తున్నారు.
ఫైట్ సీన్ తో కళ్యాణ్ రామ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు.
హీరో సోలో సాంగ్ వస్తోంది. సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది.
సోనాల్ చౌహాన్ గ్లామరస్ ఎంట్రీ ఇచ్చింది.
కళ్యాణ్ రామ్ సోనాల్ చౌహాన్ ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.
సెకండ్ సాంగ్ మొదలైంది. పాటలలో లోకేషన్స్ చాలా బాగున్నాయి.
బ్రహ్మానందం ఎంట్రీ తో థియేటర్ లో కేకలు వేస్తున్నారు.
హీరోయిన్.. బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్ బాగా పండుతున్నాయి.
సినిమాలో ఓ చిన్న ట్విస్ట్. హీరో విలన్ ల మధ్య పోటీ మొదలైంది.
హీరో..విలన్ కి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ..ఓ ఫైట్ తో సినిమా ఇంటర్వెల్ పడింది.
ఇంటర్వెల్ తరువాత సినిమా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి?
సిినిమా ఇంట్రవెల్ తర్వాత ట్విస్ట్ చిన్నగా రిలీవ్ అవుతుంది..ఇప్పుడే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృద్వి ఎంట్రీ ఇచ్చాడు.
బీచ్ సాంగ్ వస్తోంది..సోనాల్ చౌహాన్ గ్లామర్ సాంగ్ కి ప్లస్ పాయింట్.
హీరో హీరోయిన్ ల మధ్య కొంచెం బోరింగ్ గా వున్నాయి.
ఇప్పుడే లుంగీ బాబాగా ఎమ్మెస్ నారాయణ ఎంట్రీ ఇచ్చాడు. డబుల్ మీనింగ్ డైలాగ్ లతో కామెడీ పండుతుంది.
నోరా ఫతేహ ఐటమ్ సాంగ్ వస్తోంది.
సినిమాలో ట్విస్ట్ లు రిలీవ్ అవుతున్నాయి. సినిమా ఇంట్రెస్టింగ్ వే లో సాగుతూ.. క్లైమాక్స్ వైపు పయనిస్తున్నది.
భారీ ఫైటింగ్ సీన్ వస్తుంది... కళ్యాన్ యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా చేశారు. హ్యాపీ ఎండింగ్ తో సినిమా పూర్తయింది.