English | Telugu

జులై 10..బాహుబలి రిలీజ్ డేట్ ఫిక్స్

బాహుబలికి ఉన్న హైపు, క్రేజు, దానిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక హీరో అభిమానులో, లేదా తెలుగు సినిమా ప్రియులో ఎదురు చూస్తోన్న సినిమా కాదిది. మొత్తం ఇండియాలోని మూవీ లవర్స్‌ అంతా మన భారతీయ సినిమా స్థాయిని తెలియజెప్పే చిత్రమని నమ్ముతున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియా మొత్తం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాని జులై 10 విడుద‌ల చేస్తారా, లేదా? మ‌రోసారి వాయిదా వేస్తారా? అనే అనుమానాల నేప‌థ్యంలో బాహుబలి రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. తిరుప‌తిలో జ‌రిగిన బాహుబ‌లి ఆడియో వేడుక‌లో ప్ర‌భాస్ మాట్లాడుతూ ''బాహుబ‌లి జులై 10న రాబోతోంది. ఇది ఫిక్స్‌'' అన్నారు. దాంతో బాహుబ‌లి విడుద‌ల తేదీపై ఉన్న అనుమానాలు ప‌టాపంచ‌లు అయిపోయాయి. తెలుగుతో పాటు హిందీలోనూ బాహుబ‌లిని ఇదే రోజున విడుద‌ల చేస్తారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.