English | Telugu
అవిక... కేక!!
Updated : Dec 9, 2014
ఒక్కసారి అవికా గోర్ మాటలు వింటే మీకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అసలు ఈ సినిమా నటించడం.. వీళ్ల అదృష్టం అన్నట్టు మాట్లాడుతుంటుంది. సినిమాలెందుకు.. నాకు టీవీ సీరియల్స్ చాలు అంటూ బిల్డప్ ఇస్తుంది. మంచి పాత్ర కాబట్టే ఒప్పుకొన్నా.. లేదంటే పవన్ కల్యాణ్ సినిమా అయినా సరే చేయను అని తెగేసి చెప్పేస్తుంటుంది. అవిక చూడ్డానికి ఉన్నా.. మాటలు కోటలు దాటి తల బీటలు వారేలా చేస్తుంటుంది. కేకలు పెట్టిస్తుంది. ఉయ్యాల జంపాల సినిమాతో అందరినీ ఆకట్టుకొంది అవిక. ఆ తరవాత చాలా అవకాశాలొచ్చాయ్. కానీ రెండు సినిమాలే ఓకే చేసింది. వాటిలో ఒకటి... లక్ష్మీ రావే మా ఇంటికి మొన్నే విడుదలైంది. ఈసినిమా ఫ్లాప్! అందులో అవిక చేసిందేం లేదు. ఉయ్యాల జంపాల రేంజ్‌లో అవికా నట ఉంటుందని భావిస్తే.. తుస్సుమనిపించింది. అయినా సరే.. అవిక మాటలు మామూలు రేంజులో లేవు. దానికి తోడు భారీ కండీషన్లు పెడుతోందట. ''ఇలాంటి సీన్లు చేయను. మీకిష్టమొచ్చిన కాస్ట్యూమ్స్ తీసుకొస్తే వేసుకోను'' అని ముందే చెప్పేస్తోందట. పైగా చెప్పిన సమయానికి సెట్‌కి రావడం లేదని, ఏమైనా అడిగితే ''ఈ సినిమాలో నటించమని మీరు అడిగారా? నాకు నేనుగా వచ్చానా'' అని లాజిక్కులు తీస్తోందట. అవిక నటన తెరపై అదిరిపోతోంది గానీ.. దర్శక నిర్మాతలకు మాత్రం పులుసు కారిపోతోందని ఫిల్మ్‌నగర్ వాళ్లు చెప్పుకొంటున్నారు.