English | Telugu

చైతూ సినిమా టైటిల్ ఇదే

మాయ‌గాడు, హ‌రిలో రంగ హ‌రి, దొర‌క‌డు, దొంగ‌ల‌కు దొంగ‌.. నాగ‌చైత‌న్య సినిమాకి ప‌లు టైటిళ్లు ప‌రిశీలించారు. చివ‌రికీ ఏదీ డిసైడ్ చేయ‌లేక టైటిల్ చెప్ప‌కుండానే టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ''దోచెయ్‌'' అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. నాగ చైతన్య- సుధీర్ వర్మ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. కృతి సనన్ హీరోయిన్. అత్తారింటికి దారేది నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదో కామెడీ థ్రిల్ల‌ర్ ఇది. దోపిగీ నేప‌థ్యంలో సాగే క‌థ‌. అందుకే.. దోచెయ్ అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. త్వ‌ర‌లో పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. జ‌న‌వ‌రిలో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తార‌ని స‌మాచారం. ఈ టైటిల్ అయినా ఖాయ‌మేనా, లేదంటే మ‌రోటి మారుస్తారా?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.