English | Telugu
అత్తారింటికి దారేది - 2
Updated : Jan 22, 2016
ఎరుపు అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తోంది. ఏముందిలే.. వంద చిన్న సినిమాల్లో ఇదొకటి అని ఫిక్సయిపోకండి. ఇందులో చాలా మేటర్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమాతో భయంకరమైన లింకు ఉంది. అత్తారింటికి దారేది అనగానే.. రిలీజ్ కి ముందే సగం సినిమా బటయకు వచ్చేసిన ఎపిసోడ్ గుర్తొస్తుంది.
ఈ ఎరుపు కథకు మూలం అదే. అత్తారింటికి దారేది పైరసీ ఎలా జరిగింది? జరిగిన తరవాత..వాళ్లు ఎలా దొరికారు.. ఈమధ్యలో సాగిన ఓ లవ్ స్టోరీ. సినిమాల్ని పైరసీ చేసే ముఠా నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆ పైరసీ కూడా అత్తారింటికి దారేదితో ముడి పెట్టారు. టెక్నిక్ బాగానే ఉంది. మరి దాన్ని స్ర్కీన్ పై ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆనంద్ రంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కృష్ణ దర్శకుడు