English | Telugu
ఎన్టీఆర్‌కి 10.. బాలయ్యకు 1
Updated : Jan 22, 2016
ఓవర్సీస్ వసూళ్లే కీలకం అవుతున్న తరుణం ఇది. విదేశాల్లో సత్తా చాటితే.. బాక్సాఫీసుని దండుకోవచ్చన్నది దర్శక నిర్మాతల మాట. అక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి కథానాయకులూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ కల్యాణ్, మహేష్, ప్రభాస్‌ల సినిమాలు ఓవర్సీస్‌లో వసూళ్ల పంట పండించుకొంటున్నాయి. నాని కూడా భలే భలే మగాడివోయ్‌తో బంపర్ వసూళ్లు అందుకొన్నాడు.
ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో.. ఎన్టీఆర్ సినిమా మాత్రమే ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు తెచ్చుకొంది. నాన్నకు ప్రేమతో దాదాపుగా రూ.10 కోట్లు వసూలు చేసింది. ఈ విషయంలో డిక్టేటర్ మాత్రం బాలయ్య అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమాకి మొత్తమ్మీద ఓవర్సీస్‌లో కోటి రూపాయలు కూడా దక్కకపోవడం బాలయ్య అభిమానులనే కాదు, ఇండ్రస్ట్రీ వర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓవర్సీస్‌లో బాలయ్య సినిమాలకు అంత క్రేజ్ లేదన్నమాట వాస్తవం. కాకపోతే లెజెండ్, సింహాలు అక్కడ బాగానే ఆడాయి. లయన్ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ డిక్టేటర్ ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. డిక్టేటర్ కంటే.. శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజాకే ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు దక్కాయి. బీసీల్లో వసూళ్లు కుమ్ముకొంటున్న బాలయ్య.. ఏ సెంటర్లపై ఎప్పుడు ఆధిపత్యం చూపిస్తాడో??