English | Telugu
హాట్ టాపిక్ : చిరంజీవి మీసకట్టు
Updated : Jan 21, 2016
గత మూడు దశాబ్దాలుగా,తెలుగు చిత్రసీమను మకుటం లేని మారాజుగా ఏలిన చిరు, తన 150వ సినిమాకోసం ఇంతలా తర్జనభర్జన పడటం ఏమిటన్నది.ఆయన అభిమానుల్ని ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న..ఎట్టకేలకు కత్తి రీమేక్ కు ఆయన తలఊపారన్న సంగతి వాళ్లకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా,ఇక్కడ సమాధానం దొరకని మరో ప్రశ్న ఏంటంటే..ఇంత పెద్ద చిత్రసీమలో,ఆయనకు కథలే దొరకలేదా...బాలీవుడ్ తర్వాత అంత పెద్దదిగా పేరొందిన టాలీవుడ్ లో, మెగా స్టామినాకు తగ్గ కథను సిద్ధం చేయగల డైరెక్టరే లేడా..? తన జీవితంలో అత్యంత కీలకమైంది 150 వ సినిమా..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన ఛరిష్మా తగ్గింది..మెగా ఫ్యాన్స్ అందరూ గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ గా మారిపోయారు...అంతేకాక ,తన పుట్టిల్లుగా ఆయనే చెప్పుకునే సినిమా ఫీల్డ్ లోకి రీఎంట్రీ..మరి ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాకోసం,ఆల్రెడీ తమిళ తంబీలు తీసిన స్టోరీనే ఆయన తీసుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనేది ఆయన అభిమానుల ప్రశ్న..
తీసేది స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కావచ్చు..నటించేది మెగా స్టార్ కావచ్చు..కానీ చూసేది మాత్రం ప్రేక్షకులు కదా...ఆల్రెడీ ట్విస్ట్ లన్నీ తెలిసిపోయిన మూవీ కథతో,చిరు వినాయక్ లు ఏమేరకు సక్సెస్ ను చూస్తారన్నదే ఇక్కడ ప్రధానాంశం...లేటెస్ట్ గా చిరు మీసకట్టుతో కనిపించడం జనాల్లో కొద్దిగా ఇంట్రస్ట్ ను తీసుకురాగలిగినా,అది కూడా నెగటివ్ గా మారడం విచిత్రం..