English | Telugu
అల్లు అర్జున్ కి విలన్ గా యాక్షన్ కింగ్
Updated : Aug 13, 2014
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మెసెజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిల్మ్ లో బిజీగా వున్నాడు. ఇది పూర్తవగానే త్రివిక్రమ్ తో కొత్త సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. ఇప్పటికే అర్జున్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' సినిమాలో విలన్ చేసి మెప్పించారు. ఇప్పుడు మళ్ళీ అల్లుఅర్జున్ కోసం విలన్ గా మారుతున్నారు. ఒకప్పుడు హీరోల్లాగా బీజీగా వున్నవాళ్లంతా ఇప్పుడు విలన్ వేషాలు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్ గా జగపతిబాబు బాలయ్య 'లెజెండ్' సినిమా కోసం విలన్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి అర్జున్ కూడా చేరిపోయాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఇప్పుడు యాక్షన్ కింగ్ కూడా జతకావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.