English | Telugu

కన్నప్ప కి కొత్త కష్టాలు..మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం, డైరెక్టర్ కి కోర్టు నోటీసులు  

మంచు విష్ణు(Vishnu)అప్ కమింగ్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'తిన్నడు' అనే నాస్తికుడు శ్రీ కాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప' గా మారడానికి గల కారణాలు ఏంటనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ పై మోహన్ బాబు, విష్ణు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో 'కన్నప్ప' పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ప్రభాస్(Prabhas)మోహన్ బాబు(Mohan Babu)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో చేస్తున్నారు. దీంతో 'కన్నప్ప' పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు రాబడుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

కన్నప్పలో 'పిలక’, ‘గిలక’అనే బ్రాహ్మణ క్యారెక్టర్స్ ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం,సప్తగిరి పోషించినట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని,సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని, కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్‌ హైకోర్టులో పిటీషన్ వెయ్యడం జరిగింది. ఈ పిటీషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్ట్ తన తీర్పులో 'కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్‌కుమార్‌ సింగ్(Mukeshkumar Singh)నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్‌బాబు, విష్ణు తో పాటుగా, బ్రహ్మానందం, సప్తగిరికి నోటీసులు జారీచేసింది.

అనంతరం తన తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది. ఇక కన్నప్ప మూవీ ఈ నెల 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో, విష్ణు కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. విష్ణుకి జోడిగా ప్రీతి ముకుందన్ చెయ్యగా, కాజల్ అగర్వాల్, మధుబాల, రఘుబాబు, ముకేశ్ రుషి కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార చిత్రాల్లో బిజీ గా ఉంది. స్టీఫెన్ దేవసి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు మారుమోగిపోతు ఉన్నాయి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.