English | Telugu

అమ్మో... శిరీష్ వ‌దిలేడా లేడు

ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడులా త‌యార‌య్యాడు మోగా హీరో అల్లు శిరీష్‌. గౌర‌వంలో మ‌నోడి క‌టౌట్ చూసి చాలామంది ఝ‌డుసుకొన్నారు. హీరో ఫేస్ క‌ట్ అస్స‌లు లేదంటూ స‌ర్టిఫికెట్ ఇచ్చేశారు. గీతా ఆర్ట్స్‌ కొత్త జంట సినిమా కూడా ఫ‌ట్ట‌య్యింది. అందులోనూ శిరీష్ లో లోపాలు బ‌య‌ట‌ప‌డిపోయాయి. శిరీష్ తో సినిమా అంటే ద‌ర్శ‌కులు కూడా వెనుకంజ వేస్తున్నారు. దాంతో కొత్త జంట త‌ర‌వాత వేరే ఏ సినిమా ప్ర‌కటించ‌లేదు. కానీ శిరీష్ వ‌దిలేలా లేడు. గీతా ఆర్ట్స్‌లోనే మ‌రో సినిమా రూపొందించ‌డానికి రెడీ అయిపోయాడు. కొత్త ద‌ర్శ‌కుల‌ను ఆఫీసుల‌కు పిలిపించుకొని మ‌రీ క‌థ‌లు వింటున్నాడ‌ట‌. అందులో ఒక‌టో రెండో ఓకే అయిపోయాయ‌ని, త్వ‌ర‌లోనే గీతా ఆర్ట్స్ త‌ర‌పున కొత్త చిత్రం ప్ర‌క‌టిస్తామ‌ని చెబుతున్నాడు. మొత్తానికి హిట్టు కొట్టేవ‌ర‌కూ, హీరో అనిపించుకొనేంత వ‌ర‌కూ వ‌దిలేలా లేడు.