English | Telugu

స్టైలిష్ స్టార్ ని పట్టిన మిర్చి డైరెక్టర్!!

సాధారణంగా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం చాలా కష్టం. కానీ రైటర్ టర్న్ డైరెక్టర్ మారిన కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'మిర్చి' సినిమా చేసి ప్రేక్షకులకు తన టాలెంట్ ఘాటును చూపించాడు. ఇండస్ట్రీలో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన మిర్చితో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో శివ కూడా చేరాడు. కానీ రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మహేష్ శ్రీమంతుడు సినిమాను చేస్తున్న శివకు మూడో సినిమా మాత్రం వెంటనే ఓకే అయ్యింది. అల్లు అర్జున్ కి ఇటీవలే కథ వినిపించి ప్రాజెక్టు ఓకే చేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యక సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.