English | Telugu
ముకుంద ఇండస్ట్రీ టాక్
Updated : Dec 23, 2014
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ముకుంద. మెగా హీరో సినిమా కాబట్టి.. ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొన్నారు. దానికి తోడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఆయన గత సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతరాన్నీ మెప్పించాయి. ఈసారీ ఆయన క్లీన్ సినిమానే తీశారన్న సంగతి అర్థమవుతోంది. కాబట్టి ఓపెనింగ్స్‌కి తిరుగు లేకపోవచ్చు. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ సినిమాపై నెగిటీవ్ రిపోర్ట్ బయటకు వచ్చాయి. దాంతో మెగా ఫ్యాన్స్‌లో కలవరం మొదలైంది. ఇటీవల ముకుంద చిత్రాన్ని కొంతమంది సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించారు. ''సినిమా మరీ స్లోగా ఉంది... సెకండాఫ్ ల్యాగ్..'' అంటూ రిపోర్ట్ వచ్చింది. మరీ ఇంత స్లో నేరేషన్ ఈతరం ప్రేక్షకులకు నచ్చుతుందా? అనేదే అనుమానం. దానికి తోడు.. దర్శకుడు అరిగిపోయిన కథని తీసుకొన్నాడని తెలుస్తోంది. కాకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్ రిలేషన్‌ని దర్శకుడు బాగానే మిక్స్ చేశాడట. అదొక్కటే ఈసినిమాని గట్టెక్కిస్తుందంటున్నారు. పైగా వరుణ్‌తేజ్ మొదటి సినిమా. వరుణ్ ఎలా చేశాడో అన్న ఆసక్తితో కూడా జనం థియేటర్లకు రావొచ్చు.