English | Telugu
త్రివిక్రమ్ తో బన్నీ హ్యాట్రిక్ సినిమా
Updated : Mar 13, 2016
అల్లు అర్జున్ రోటీన్ కు భిన్నంగా ఉండటానికే ఇష్టపడతాడు. తన సినిమాలకు స్టార్ డైరెక్టర్స్ అయితే తప్ప రిపీట్ చేయడు. వివి వినాయక్(బన్ని, బద్రీనాథ్) , సుకుమార్(ఆర్య, ఆర్య2), త్రివిక్రమ్(జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి) లతో రెండేసి సినిమాలు చేశాడు. తాజా సమాచారం ప్రకారం, తనకు రెండు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ తోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే తన కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నా, బన్నీ మాత్రం త్రివిక్రమ్ కే ఓటేశాడని సమాచారం. త్రివిక్రమ్ చెప్పిన కథ బాగా నచ్చేసిందట. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్స్ కొట్టేసిన ఈ కాంబో, ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని డిసైడయ్యారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.