English | Telugu
"బద్రీనాథ్" షూటింగ్ లో అల్లు అర్జున్
Updated : Mar 16, 2011
ఈ "బద్రీనాథ్" చిత్రానికి ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ అద్భుతమైన కథనందించారట.ఈ "బద్రీనాథ్" చిత్రంలోని రెండు పాటల్లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ అమోఘమైన డ్యాన్స్ చేశారట. అంతేకాక ఈ చిత్రంలో రామ్ చరణ్ "మగధీర" చిత్రంలో చంపినట్లు అల్లు అర్జున్ కూడా వందమందిని చంపుతాడట. ఇవన్నీ పక్కన పెడితే ఈ "బద్రీనాథ్" చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ లా కత్తితో పోరాడతాడని తెలిసింది.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ "బద్రీనాథ్" చిత్రం షూటింగ్ మార్చ్ 21 వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ స్కెడ్యూల్లో ప్యాచ్ వర్కంతా పూర్తి చేస్తారు. ఈ "బద్రీనాథ్" సినిమా ఒక సోషియో ఫాంటసీ కథతో నిర్మిస్తున్నారట.