English | Telugu

మేడమ్‌ టుస్సాడ్స్‌లో బన్ని విగ్రహం.. తొలి తెలుగు హీరోగా రికార్డ్‌!

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేయించి తమ మ్యూజియంలో ఉంచడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడా గౌరవం జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌కి కూడా దక్కింది. అయితే ఇంతకుముందు ప్రభాస్‌, మహేష్‌ వంటి స్టార్‌ హీరోల విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్‌ తొలి హీరో ఎలా అవుతాడు? అతను రికార్డ్‌ ఎలా సాధించాడు? అంటే.. దాని వెనుక ఒక రీజన్‌ ఉంది.

90 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ హీరో కూడా సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ‘పుష్ప’ చిత్రంలోని తన నటనతో అల్లు అర్జున్‌ సాధించాడు. ఆ విధంగా టాలీవుడ్‌లో ఒక రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ విగ్రహాన్ని ఉంచబోతున్నారు. దీని కోసం అల్లు అర్జున్‌ కొలతలను తీసుకున్నారు. త్వరలోనే మేడమ్‌ టుస్సాడ్స్‌లో బన్ని విగ్రహాన్ని చూసే వీలు కలుగుతుంది. మరి తొలి తెలుగు హీరోగా ఈ విషయంలో ఎలా రికార్డ్‌ సాధించాడు అంటారా? ఇంతకుముందు ప్రభాస్‌, మహేష్‌ల విగ్రహాలను సింగపూర్‌, బ్యాంకాక్‌లలోనెలకొల్పారు. ఇప్పుడు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం చరిత్రలోనే తొలిసారి ఒక తెలుగు హీరో విగ్రహాన్ని దుబాయ్‌ ఉంచబోతున్నారు. ఆ విధంగా అల్లు అర్జున్‌ రికార్డ్‌ సృష్టించారు. నేషనల్‌ అవార్డు సాధించడంలోనే కాదు, మైనపు విగ్రహం విషయంలోనూ బన్ని సాధించిన రికార్డ్‌ ఇది.