English | Telugu
అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్
Updated : Aug 12, 2014
సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. సామాజిక బాధ్యతపై అవగాహన కలిగించేందుకు తన సొంత నిర్మాణంలో.. నటిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్‌కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు 'ఐయామ్ దట్ చేంజ్'. దీనిని స్వాతంత్య దినోత్సవం రోజైన ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి అల్లు అర్జున్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిడివి 2:45 నిమిషాలు. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ తన ఫేస్‌బుక్‌లో ఉంచారు.
దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక స్టార్ హీరో చేస్తోన్న మొదటి షార్ట్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్టుకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయడంతో అభిమానులు షార్ట్ ఫిల్మ్ పై ఆసక్తిగా వున్నారు. ఇటీవలే పూర్తయిన ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అమూల్ రాథోర్ కూడా పాలు పంచుకున్నారు.