English | Telugu
సాయి ధరమ్ తేజ్ ఆకతాయిగా మారుతున్నాడా..?
Updated : Apr 23, 2016
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోరు మీదున్నాడు. సినిమాల తర్వాత సినిమాలు ఒప్పేసుకుంటూ ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సుప్రీం రిలీజ్ కు రెడీ గా ఉండగా, తిక్క కూడా పూర్తి కావచ్చింది. మరో వైపు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు కమిట్ అయ్యాడు సాయి. రకుల్ ప్రీత్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు అయిపోయాయని, ఇక ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ రేపో మాపో మొదలెట్టెయచ్చని సినీ వర్గాలంటున్నాయి. కథ ప్రకారం హీరో పాత్ర చాలా ఆకతాయితనంతో ఉంటుందని, అందుకే సినిమాకు అదే పేరు పెట్టే ఆలోచనలో మూవీ టీం ఉన్నారట. దీంతో ఈ ఏడాది సాయి సినిమాల సంఖ్య మూడుకు పెరిగింది. వీటిలో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ పడినా, మరిన్ని అవకాశాలతో సాయి దూసుకెళ్లిపోతాడనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం సాయి ఆశలన్నీ సుప్రీమ్ మీదే ఉన్నాయి. మే మొదటి వారంలో సుప్రీం రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే..