English | Telugu

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై స్పందించిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షకు నిరాకరించి, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరగడంపై అల్లు‌అర్జున్ స్పందించారు. ఆ రాత్రి పోలీసులు నా కారును ఆపినప్పుడు ఏం జరిగిందంటే.. పోలీసులు నాకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష చేస్తానన్నారు. అయితే కెమెరాలన్నీ నా మీద ఫోకస్‌ చేసి ఉండటంతో నాకు కాస్త అసౌకర్యంగా ఉందని వారికి చెప్పాను. కెమెరాలను అక్కణ్ణించి తప్పించాక, నేను పరీక్ష చేయించుకున్నాను. బ్రీత్ అనలైజర్ పరీక్ష తర్వాత మద్యం తీసుకోలేదని నిర్ధారించుకున్న పోలీసులు తనను పంపించారని వెల్లడించాడు. అయితే అల్లు అర్జున్ ‘ఐ యామ్‌ దట్‌ చేంజ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మించి ప్రశంసలు అందుకున్న కొద్ది రోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనించాల్సిన విషయం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.