English | Telugu

కిక్ అంటే ఇదీ..స్టార్ట్ కాకుండానే రిలీజ్ డేట్

మాస్ మహారాజా రవితేజ, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కిక్ 2′ సినిమా ఓపెనింగ్ ఈరోజు ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరయ్య సందడి చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ సినిమా ప్రారంభంకాకముందే విడుదల తేదిని ప్రకటించారు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ‘కిక్ 2′ మే28 2015న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి మిల్కీ బ్యూటీ తమన్నా ని తీసుకున్నట్లు సమాచారం . అయితే ఈవిషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘కిక్’ చిత్రానికి సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.