English | Telugu

అల్లు అరవింద్ పై భూకబ్జా కేస్

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, మెగా స్టార్ బావమరిది అయిన అల్లు అరవింద్ పై భూకబ్జా కేస్ నమోదయ్యింది. నార్సింగ్ లో ఉన్న తన నాలుగు ఎకరాల స్థలాన్ని అల్లు అరవింద్ అతని కుటుంబ సభ్యులు కబ్జా చేశారని కోర్టులో కేస్ ఫైల్ చేయగా, ఎనిమిదవ మెట్రోపాలిటిన్ కోర్టు వారి ఆదేశాల మేరకు, రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ అదేశాల మేరకు నార్సింగ్ ఇనస్పెక్టర్ నారాయణ అల్లు అరవింద్ మరియూ అతని కుటుంబ సభ్యులపైనా కేస్ రిజిస్టర్ చేశారని సమాచారం.

ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు నిర్మల, వసంత లక్ష్మి తదితరులపై ఐ.పి.సి. 420 (ఛీటింగ్),468, 471, 474, 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.ఈ స్థలం తాలూకు సేల్ డీడ్, రెవెన్యూ రికార్డులను పోలీస్ వారు పరిశీలిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మెగా ప్రొడ్యూసర్ గా పేరు గడించిన అల్లు అరవింద్ పై, మార్చ్ 6 వ తేదీన వివాహం కానున్న అల్లు అర్జున్ పైనా ఇలా కేసు రావటం వారి మర్యాదకు భగంకలిగించే విషయంగా సినీ వర్గాలంటున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం