English | Telugu
అల్లరి నరేష్ అండ్ విజయ్ మాల్యా సెల్ఫీ
Updated : Mar 12, 2016
విజయ్ మాల్యా..ఇండియా ప్లేబోయ్. ఇప్పుడు మన దేశంలో ట్రెండింగ్ అవుతున్న పేరు. దాదాపు 9వేల కోట్ల రూపాయలకు బ్యాంకులకు టోకరా వేసి ఫారిన్ జంప్ అయిపోయాడు. అల్లరి నరేష్ మన టాలీవుడ్ హీరో. వీళ్లిద్దరికీ లింక్ ఎక్కడ కుదురుతుంది..? అసలు వీళ్లిద్దరికీ ఎలా సింక్ అయిందో సినీజనాలకు అర్ధంకావట్లేదు. ఇంతకీ విషయమేంటంటే, అల్లరి నరేష్ తన ట్విట్టర్లో, విజయ్ మాల్యాతో సెల్ఫీ దిగినట్టున్న ఫోటో పెట్టాడు. బ్యాంకులకు దొరకని విజయ్ మాల్యా నా సెల్ఫీకి చిక్కాడు. ఇండియాలో విజయ్ మాల్యా లాస్ట్ సెల్ఫీ ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశాడు. సరిగ్గా చూస్తే ఇది ఫోటో షాప్ చేసిన ఫోటో అని తెలుస్తూనే ఉంది. త్వరలో రాబోతున్న తన సెల్ఫీ రాజా సినిమా కోసమే అల్లరి నరేష్ ఈ ట్వీట్ అంటున్నారు సినీ జనాలు.