English | Telugu
బాలయ్య వందో సినిమా ' యోధుడు '..?
Updated : Mar 12, 2016
గత కొన్ని రోజులుగా, సినీ అభిమానుల్లో ఒకటే చర్చ. బాలకృష్ణ వందో సినిమా డైరెక్టర్ ఎవరు..టైటిల్ ఎంటి..? ఈ రెండు ప్రశ్నలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిపై ఎవరికి తోచిన సమాధానం వాళ్లు అల్లేసుకుంటున్నారు. కానీ నిజానిజాలు మాత్రం బాలయ్య చెబితే గానీ తెలిసేలా లేవు. మొన్నటి వరకూ ఆల్ మోస్ట్ కృష్ణవంశీ సినిమా కన్ఫామ్ అనుకుంటుండగానే, సడెన్ గా క్రిష్ రంగంలోకి దిగాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో బాలయ్యను ఇన్ స్పైర్ చేసేయడంతో ఇప్పుడు అదే కన్ఫామ్ అంటున్నారు.
ఈ సినిమాకు ' యోధుడు ' అనే పేరును అనుకుంటున్నారని సమాచారం. ఒక రాజు కథ కావడంతో, శాతకర్ణి పాత్రకు ఇదే కరెక్ట్ గా సూటవుతుందనేది టీం ఆలోచన. కానీ బాలయ్య అభిమానులకు మాత్రం ఈ టైటిల్ రుచించట్లేదు. లెజండ్, సింహా, డిక్టేటర్ లాంటి టైటిల్స్ తో పోలిస్తే, యోధుడు చాలా సింపుల్ గా ఉంది అంటున్నారు. పైగా ఇంతకు ముందు వచ్చిన మిత్రుడు టైటిల్ బాలయ్యకు కలిసిరాలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మరొకటి ఆలోచిస్తారా లేక ఇదే ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది