English | Telugu
అలా మొదలైంది రీమేక్ లో శాన్వి
Updated : Apr 22, 2014
"లవ్లీ"తో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శాన్వి ప్రస్తుతం కన్నడ వైపు అడుగులు వేస్తుంది. తెలుగులో నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన "అలా మొదలైంది" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శాన్వి నటించనుంది. సురేందర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాధు కోకిల దర్శకత్వం వహిస్తున్నాడు. శైలేంద్ర నిర్మాత. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మడు త్వరలోనే టాప్ హీరోయిన్ గా మారే అవకాశాలున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం ఆదితో కలిసి "ప్యార్ మే పడిపోయానే" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.