English | Telugu

ఆ మూడు అక్షరాలే మాకు అన్నీ..నాగార్జున

అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2014 ప్రదానోత్సవం గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్‌లో జరిగింది. వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానంతోపాటు అక్కినేని కాంస్య విగ్రహావిష్కరణలో అక్కినేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే తమకు నాన్న, స్నేహితుడు, తత్వవేత్త అని అక్కినేని నాగార్జున తెలిపారు. నాన్న నాల్గవ తరగతి చదివినా... నాలుగు తరాలు గర్వించేలా జీవించారని గర్వంగా చెప్పారు. ఏఎన్ ఆర్ పిల్లలుగా తామెంతో గర్విస్తున్నామన్నారు. విద్యాలయాలను నాన్న ఎప్పుడూ దేవాలయాలుగా చూసేవారని అన్నారు. చిత్ర రంగంలో దర్శకుడు రాఘవేంద్రరావు, గుమ్మడి గోపాలకృష్ణ, శాస్త్ర, సాంకేతిక రంగానికి గాను డా.ఐ.కే. వరప్రసాద రెడ్డి, జ్యోతి సురేఖ, వంశీ రామరాజు, విద్యారంగంలో ఎంఎన్ రాజు, జస్టిస్ పర్వతరావు, ఆరోగ్య విభాగంలో సేవలందించిన డా. గోపీచంద్ మన్నం, పౌరసేవల విభాగంలో సంపత్ కుమార్ లు అక్కినేని పురస్కారాలు అందుకున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.