English | Telugu

మహేష్ న్యూఇయర్ కి ఎక్కడ వుండబోతున్నాడు?

ఈ సంవత్సరం వరుస షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, న్యూఇయర్ సంధర్బంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. దీని కోసం ఫ్యామిలీతో కలిసి హాలిడేకు ప్లాన్ చేసారు. కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విదేశాల్లో అయితేనే బాగా ఎంజాయ్ చేయగలం అని భావించిన ఆయన.. కొత్త సంవత్సరం వేడుకలను అబూదాబిలో జరుపుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఆయన భార్య నమ్రతా శిరోద్కరే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.


మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లు లోకల్‌గా ఉంటే న్యూఇయర్ సంబరాల్లో పాల్గొనడం కష్టమే. ఎందుకంటే వారికి భారీ సంఖ్యలో ఉన్న అభిమానులు వారిని ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వరు. ఇక వారి ప్రతి మూమెంట్‌ను కవర్ చేయడానికి మీడియా వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అందుకే పెద్ద స్టార్స్ అంతా ఫారిన్ టూర్ కే ఇంట్రస్టు చూపుతుంటారు. అక్కడైతే ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు... ఎంచక్క తనివితీరా ఎంజాయ్ చేయొచ్చు. మీడియా కన్ను తమపై ఉంటుందనే భయం కూడా ఉండదు. కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న మహేష్‌కి ఈ అబుదాబి ట్రిప్ కాస్తంత రిలాక్స్‌నివ్వనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.