English | Telugu

ఎన్టీఆర్, సుకుమార్ సినిమాకి క్లాప్ కొట్టారు

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్‌ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్‌ 18 ఉదయం 11.39 గంటలకు సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, భోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటాయి. ఎన్టీఆర్‌కి డిఫరెంట్‌ మూవీ అవుతుంది. సబ్జెక్ట్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ఈరోజు ముహూర్తం బాగుండడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 7 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. మా బేనర్‌లో ఇది ఒక ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌తో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా వుంది. తారక్‌లో ఎంతో ఎనర్జీ వుంది. ఆ ఎనర్జీని ఎలివేట్‌ చేసే స్కోప్‌ వున్న సబ్జెక్ట్‌. ఇది ఒక రివెంజ్‌ డ్రామా. డిఫరెంట్‌ స్టైల్‌లో వుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్‌.