English | Telugu

హాట్ న్యూస్: అఖిల్ వీడియో లీక‌య్యింది

చిత్ర‌సీమ‌లో లీకేజీల గోల ఎక్కువైంది. నెల‌ల‌ క‌ష్టం, కోట్ల ఖ‌ర్చు, ఎన్నో ఆశ‌ల‌తో ఓ సినిమా తీస్తే.. విడుద‌ల‌వ్వ‌క‌ముందే లీకేజీల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. ఇప్పుడు అఖిల్ సినిమాకి సంబంధించిన ఓ డాన్సింగ్ క్లిప్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అఖిల్ - వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల స్పెయిన్‌లో యాక్ష‌న్ ఘ‌ట్టాలు, పాట తెర‌కెక్కించారు. స్పెయిన్ రోడ్ల‌పై అఖిల్ డాన్స్ చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. స్పెయిల్ లో పాట షూట్ చేస్తున్న‌ప్పుడు ఎవ‌రో ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి.. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసేశారు. ఈ వీడియో క్ష‌ణాల్లో అక్కినేని ఫ్యాన్స్‌కి చేరిపోయింది. సెట్లో వీడియో కాబ‌ట్టి.. ఫ్యాన్స్ లైట్ తీసుకొన్నారు. అయితే అందులో అఖిల్ డాన్సింగ్ స్టైల్ చూసి మురిసిపోతున్నారు. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, సుమంత్ వీళ్లెవ‌రూ డాన్స‌ర్లు కాదు. ఏదో ఆ పాట‌ని అలా కానిచ్చేస్తారంతే. కానీ.. అఖిల్ మాత్రం డాన్స్ నేర్చుకొని మ‌రీ రంగంలోకి దిగాడు. సో.. స్టెప్పులు ఇర‌గీదీయ‌డం ఖాయం. ఇప్పుడు ఈ లీకైన వీడియో అభిమానుల‌కు మ‌రింత భ‌రోసా క‌ల్పిస్తోంది.