English | Telugu

దిల్‌రాజు ద‌గ్గ‌ర డ‌బ్బులైపోయాయా?

బ‌ళ్లు ఓడ‌లుగా మార‌డానికి, ఓడ‌లు మ‌ళ్లీ బ‌ళ్ల‌యిపోవ‌డానికి చిత్ర‌సీమ‌లో అట్టేకాలం పట్ట‌దు. ఎంతోమంది హేమాహేమీలైన నిర్మాత‌లు.. చివ‌రి రోజుల్లో పూట గ‌డ‌వ‌క దుర్భ‌ర‌ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికీ కొంత‌మంది నిర్మాత‌లు సినిమాల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌నే నిర్ణ‌యంతో.. చిత్ర‌సీమ‌వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోని నిర్మాత‌ల్లో కొంద‌రి ప‌రిస్థితి దుర్భ‌రంగా ఉంద‌ని, ఏ క్ష‌ణంలో అయినా బోర్డు తిప్పేయొచ్చ‌ని.. ఫిల్మ్‌న‌గర్ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి. బెల్లంకొండ సురేష్ ఆల్రెడీ న‌ష్టాల ఊబిలో కూరుకుపోయి ఎలా బ‌య‌ట‌కు రావాలో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇప్పుడు దిల్‌రాజు ప‌రిస్థితీ ఇంతేన‌ని స‌మాచారం. నిర్మాత‌గా, పంపిణీదారుడుగా తిరుగులేని స్ట్రాట‌జీ దిల్‌రాజుది. ఆయన సంస్థ పేరు చెప్ప‌గానే ఎన్నో హిట్ చిత్రాలు క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌తాయి. హిట్ల వ‌ల్ల ఎంత సంపాదించుకొన్నాడో తెలీదుగానీ, ఫ్లాపుల వ‌ల్ల మాత్రం చాలా పోగొట్టుకొన్నాడు. ఈ మ‌ధ్య ఆయ‌న జ‌డ్జిమెంట్ కూడా త‌ప్పుతోంది. రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాతో స‌గం డ‌బ్బులు పోయాయని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకొంటాయి. సీత‌మ్మ‌వాకిట్లో లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా తీసినా ఏం మిగుల్చుకోలేక‌పోయాడు. కొన్ని చిన్న సినిమాల్లో పెట్టిన పెట్టుబ‌డి గోడ‌కు కొట్టిన సున్నమైంది. ఆ మ‌ధ్య పంపిణీదారుడిగానూ న‌ష్టాలొచ్చాయి. అందుకే.. దిల్‌రాజు ప్ర‌స్తుతం కామ్ అయిపోయాడ‌న్న టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాల‌కు ఆయ‌న పేరుకే నిర్మాత‌. డ‌బ్బులు బ‌య‌ట వ్య‌క్తులు పెడుతున్నార‌ట‌. ఇక ముందూ.. ఈ ప‌ద్ధ‌తినే అనుస‌రించాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. బినామీగా ఉంటూ... సినిమాలు తీస్తే నిర్మాత‌గా కొన‌సాగిన‌ట్టుంటుంది, దానికి తోడు - త‌న నిర్మాణ చాతుర్యంతో లాభాలూ తెచ్చిపెట్టొచ్చు. అదీ దిల్‌రాజు న‌యా స్ట్రాట‌జీ.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.