English | Telugu
అఖిల్ ఎందుకు సారీ చెప్పాడు ?
Updated : Jun 19, 2014
అఖిల్ చూడటానికి క్యూట్‌గా కనిపించడమే కాదు, అతని పనులు కూడా స్వీట్‌గా వున్నాయి. ఈ సిసీంద్రి హీరోగా పరిచయమవబోతున్నాడు అని "మనం " సినిమా విడుదల తర్వాత విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి స్పందిస్తు ఇరవై రోజుల్లో సినిమా వివరాలు తెలియచేస్తానంటూ ప్రకటించాడు అఖిల్. ఈ ప్రకటన చేసి దాదాపు నెల రోజులు అవుతోంది. సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచుస్తున్న అభిమానులు డిసప్పాయింట్ అయి వుంటారని అఖిల్ అర్థం చేసుకుని వారిని ఉద్దేశ్యించి ట్వీట్ చేశాడు.
అనుకున్న సమయానికి తన మొదటి సినిమా గురించి చెప్పలేక పోయినందుకు క్షమించండి అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆలస్యమవడం తనకు నచ్చట్లేదని, కానీ సినిమా ఓకే చెయ్యాలంటే చాలా విషయాలు ప్రిపేర్ కావల్సి వుంటుంది, అందువల్లే ఈ ఆలస్యం జరుగుతోందని, ఉద్దేశ్య పూర్వకంగా కాదంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు ఈ క్యూట్ బాయ్. సినిమాల్లోకి రాక ముందే అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ఎంతో రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఈ అక్కినేని బుల్లోడు.