English | Telugu

బాలీవుడ్ భామను నిలదీసిన అధికారులు



బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు 2 గంటలపాటు నిలిపివేశారు. ఆమె వద్ద వున్న ఒక పౌడర్ విషయంలో అనుమానం తలెత్తి విమానాశ్రయ భద్రతాధికారులు, కస్టమ్స్ అధికారులు రెండు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఆయుర్వేద పౌడర్ డబ్బాని చూసి అధికారులు అనుమానించారని. చర్మ సౌందర్యానికై తాను ఆరు నెలలుగా వాడుతున్నానని ఆమె అధికారులకు నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదట.


ఢిల్లీ నుంచి ఇంతకు ముందు ఇలా తీసుకువెళ్లినప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది ఎదురవలేదని మొదటి సారి ఇలా అధికారులు తనను నిలిపివేశారని రిచా చడ్డా చెప్పుకొచ్చింది. ఆయుర్వేదాన్ని తాను పూర్తిగా నమ్ముతానని, అందుకే ఆయుర్వేద వస్తువులే వాడతానని రిచా తెలియచేసింది. అయితే ఆ ఆయుర్వేద పౌడర్ దొరకడం కష్టమని అందుకే ఆ డబ్బా తెరవడానికి తాను ఒప్పుకోలేదని రిచా తెలిపింది. కానీ వారు ఈ విషయాన్ని నమ్మకపోవడంతో డబ్బా తెలిచి చూపించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. ఆమె 'గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' చిత్రాల్లో నటించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.