English | Telugu

ఆది"ప్రేమ కావాలి" సక్సస్ మీట్

ఆది హీరోగా, మ్యాక్స్ ఇండియా పతాకంపై, కె.విజయభాస్కర్ దర్శకత్వంలో,కె.అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం"ప్రేమ కావాలి".ఈ చిత్రంతో ఇషా చావ్లా హీరోయిన్ గా పరిచయమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించ బడుతూండటంతో, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రం సక్సస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ సక్సస్ మీట్ లో ఈ చిత్ర దర్శక, నిర్మాతలూ,సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, హీరో, హీరోయిన్లతో పాటు నటుడు సాయి కుమార్, సహనిర్మాత సురేష్ రెడ్డి, పి.ఆర్.ఒ.బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ చిత్రానికింతటి ఘనవిజయాన్ని చేకూర్చినందుకు వీరంతా ప్రేక్షకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం