English | Telugu

నెగెటివ్ రోల్ లో త్రిష..!

చెన్నై బ్యూటీ త్రిష ఒకప్పుడు తెలుగు, తమిళంలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత నెమ్మదిగా ఆఫర్లు తగ్గినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ మునుపటి కంటే ఎక్కువ గ్లామరస్ గా కనిపిస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలు హీరోయిన్ గా.. ఇతర పాత్రల్లో నటించిన త్రిష ఇప్పుడు నెగెటివ్ రోల్ లో నటించనుంది. సెంథిల్ కుమార్ దర్శకత్వంలో.. ధనుష్ హీరోగా నటించే సినిమాలో త్రిష కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా ధనుష్ కి జంటగా త్రిష, షాలినిలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో త్రిష పాత్ర నెగెటివ్ షేడ్ లో ఉంటుందట.. అంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్ర లాంటిదంట. మరి నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసింది మాములు నటన కాదు.. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం డామినేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాలో ముందు రజనీకాంత్ కంటే రమ్యకృష్ణనే గుర్తొస్తుంది. మరి అలాంటి షేడ్ ఉన్న పాత్రలో ఇప్పుడు త్రిష నటించి ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.